పీఎమ్ ఎఫ్ ఎమ్ ఈ ద్వారా ఎగ్ కార్ట్ షాప్…

పీఎమ్ ఎఫ్ ఎమ్ ఈ ద్వారా ఎగ్ కార్ట్ షాప్…

ప్రారంభించిన ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు..

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు పట్టణంలోని మధిర రోడ్డుకు చెందిన కొలికపోగు స్వాతి, కోలా శ్యాం సుందరి అనే లబ్ధిదారులకు పి ఎం ఎఫ్ ఎం ఈ (ప్రధాన మంత్రి ఫార్మాలిసాషన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రిసెస్ స్కీం ) పథకం ద్వారా మంజూరైన ఎగ్ కార్ట్ దుకాణాలను శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఫుడ్ పరిశ్రమలో చిన్న స్థాయి వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు.

తమ ప్రాంతంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించి ఆర్థికంగా ఎదగాలనుకునే నిరుద్యోగ యువతకు ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్మా సభ్యులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply