sunday | ఫ్రీ దర్శనానికి 2గంటలు..
sunday | ఫ్రీ దర్శనానికి 2గంటలు..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేసవి సెలవులు రావడం, ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎండ వేడిమి తగలకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
