180centers | విద్యార్థుల జోష్, పేరెంట్స్‌లో టెన్షన్

180centers | విద్యార్థుల జోష్, పేరెంట్స్‌లో టెన్షన్

1.30 దాటితే నో ఎంట్రీ…
కఠిన నిబంధనలతో పరీక్షా కేంద్రాలు..
రాష్ట్రంలోనే విజయవాడకు అత్యధిక పరీక్షా కేంద్రాలు…
32 సెంటర్లలో 12 వేల మంది అభ్యర్థులు.
బయోమెట్రిక్, పోలీస్ బందోబస్తు,
అబ్జర్వర్ల పర్యవేక్షణతో పకడ్బందీ ఏర్పాట్లు..
ఎంబీబీఎస్ కల సాకారం కోసం..
విద్యార్థుల జీవితాన్ని మలిచే తుది పరీక్ష..

180centers | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : వైద్య విద్యలో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే నీట్ – యూ జీ పరీక్ష నిర్వహణకు తెలుగు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్ష కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండగా… పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

180centers | అత్యధిక సెంటర్లు విజయవాడలోనే..

ప్రత్యేకించి విజయవాడ నగరం రాష్ట్రవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర బిందువుగా మారింది. నగరంలోని ఆంధ్ర లో్యోలా కాలేజీ సహా మొత్తం 32 పరీక్షా కేంద్రాల్లో సుమారు 12 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తుండగా, రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు విజయవాడలో పరీక్షకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 180 కేంద్రాల్లో సుమారు 45 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం ప్రారంభించగా, మధ్యాహ్నం 1.30 గంటలు దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతి లేదని అధికారులు కఠినంగా స్పష్టం చేశారు.

180centers |

దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకుని అన్ని ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేసుకుంటున్నారు. ప్రతి అభ్యర్థి హాల్ టికెట్‌తో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని ముందస్తు సూచనలు ఇవ్వగా, కేంద్రాల వద్ద గుర్తింపు ధ్రువీకరణ, బయోమెట్రిక్ నమోదు, ఫిజికల్ స్కానింగ్ వంటి ప్రక్రియలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. నెట్‌వర్క్ సమస్యలు తలెత్తినా ఇబ్బంది లేకుండా ఆఫ్‌లైన్ బయోమెట్రిక్ సదుపాయం కూడా కల్పించారు. విద్యార్థుల పరీక్షా సమయం వృథా కాకుండా ఈ ప్రక్రియను ముందుగానే పూర్తి చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

180centers |

పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ట్యాబ్‌లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు పూర్తిగా నిషేధం విధించారు. డ్రెస్ కోడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి పంపిస్తున్నారు.

180centers |

180centers | విస్తృత ఏర్పాట్లు..

మరోవైపు నీట్ పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులను కేంద్రాల బయటే నిలిపివేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, జనరేటర్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించారు. 500 మందికి పైగా అభ్యర్థులు రాసే కేంద్రాలకు ఇద్దరు అబ్జర్వర్లు, తక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఉన్న కేంద్రాలకు ప్రత్యేక పర్యవేక్షకులను నియమించారు.

180centers |

180centers | దేశవ్యాప్తంగా 22 లక్షల మంది…

దేశవ్యాప్తంగా ఈసారి నీట్ పరీక్ష లో సుమారు 22 లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు నమోదు చేసుకోగా, 551 నగరాలు, విదేశాల్లోని 14 కేంద్రాలు కలిపి వేల సంఖ్యలో పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. వికలాంగ అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

నెలలు తరబడి కష్టానికి పరీక్ష..

వైద్య విద్యలో సీటు సాధించాలనే లక్ష్యంతో నెలల తరబడి కష్టపడిన విద్యార్థులకు ఇది అత్యంత కీలక సమయం. ఒకవైపు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తుండగా… మరోవైపు బయట వేచి ఉన్న తల్లిదండ్రుల ముఖాల్లో ఉత్కంఠ స్పష్టంగా కనిపించింది. డాక్టర్ కావాలనే చిరకాల కోరికతో రాత్రనకా పగలనకా కష్టపడి చదివి విజయం కోసం ఎంతో ఉత్కంఠతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. మొత్తం మీద నీట్ పరీక్ష నిర్వహణకు విజయవాడ సహా రాష్ట్రవ్యాప్తంగా అధికారులు చేపట్టిన ఏర్పాట్లు ప్రశంసలు అందుకుంటున్నాయి.

CLICK HERE TO READ MORE : aijobs| ఏఐ ప్రభావం ఉద్యోగాలకు ముప్పా, లేక కొత్త అవకాశాలా!

CLICK HERE TO READ MORE

Leave a Reply