Post-mortem | చేతబడి నెపంతో…

Post-mortem | చేతబడి నెపంతో…
Post-mortem | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. కొత్తూరు మండలం చిన్నరాజపురం గ్రామంలో చేతబడి నెపంతో సవర ఇల్లంగి, జ్యోతి అనే దంపతులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది.
స్థానిక సమాచారం ప్రకారం…. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దంపతులపై దాడి చేసి హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
