పీఎంజేజేబీవై బీమా చెక్కు అందజేత
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ పట్టణంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన సలాది అనిత ఉట్నూర్ ఎస్బిఐ బ్యాంకులో పీఎంజేజేబీవై బీమా పథకం లో బీమా డబ్బులు కట్టింది. ఆమె మృతి చెందడంతో ఉట్నూర్ ఎస్బిఐ బ్యాంక్ ద్వారా మృతి చెందిన సలాది అనిత భర్త నామిని కి సలాది రామస్వామికి 2 లక్షల రూపాయల భీమచెక్కును ఈ రోజు ఉట్నూర్ ఎస్బిఐ మేనేజర్ అఖిలేష్ కుమార్ వర్మ, బ్యాంక్ అధికారులు నామిని రామస్వామికి అందించారు.
ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. అనిత తమ బ్యాంకు ద్వారా బీమా పథకంలో ప్రీమియం తీసుకోవడంతో ఆమె మృతి చెందగా ఆమెకు మంజూరైన భీమా డబ్బుల చెక్కును నామినీకి అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మక్కెన బాలకృష్ణ, క్యాషియర్ ఆఫీసర్ గెంబాలి మహేష్, సీఎస్పీ జాదవ్ మహేష్ పాల్గొన్నారు.
