ఆలయ పునర్నిర్మాణ పనులకు మట్టి నమూనాల సేకరణ..
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆలయ పరిసరాల్లో మట్టి నమూనాల సేకరణ చేపట్టారు.
ఆలయ తూర్పు గోపురం వద్ద యంత్రాల సహాయంతో మట్టి నమూనాలను సేకరించిన అధికారులు, అంతకుముందు ఆలయ అతిథి గృహాల సమీపంలో కూడా ప్రత్యేక యంత్రం ద్వారా మట్టి నమూనాలు సేకరించారు.
పునర్నిర్మాణ పనుల నాణ్యత, భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
