పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయం

పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయం

మండల విద్యాధికారి తలమల్ల మల్లేశం.

మునుగోడు, ఆంధ్రప్రభ : మట్టిలో మాణిక్యాలను అందించిన మునుగోడు జిల్లా పరిషత్ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల చొరవ అభినందనీయమని మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం అన్నారు.ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001–02 10వ తరగతి పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చి ఒక బీరువాను బహుకరించారు. అలాగే పాఠశాలలో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు 2025–26 విద్యాసంవత్సరంలో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచే విద్యార్థులకు వరుసగా రూ.12 వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.

అనంతరం మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులు కలలు సాకారం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. ఎందరో ఇక్కడ చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. పాఠశాల అభివృద్ధికి వారు కృషి చేస్తుండడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్,పూర్వ విద్యార్థులు పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్, కూరెళ్ల జ్ఞానేశ్వర్,ఈద ప్రవీణ్, బొల్లు సైదులు, చెరుకు నరేందర్, ముచ్చపోతుల శ్రవణ్ కుమార్, నారగోని శ్రీశైలం, పాఠశాల చైర్మన్ పందుల ఎల్లమ్మ, ఉపాధ్యాయులు కే.సత్తిరెడ్డి, రత్నయ్య, అన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply