చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..

  • సీఐ పవన్ కుమార్ ఎస్సై సతీష్.

మరిపెడ, ఆంధ్రప్రభ ; ప్రతి వ్యక్తి చెడు అలవాట్లకు దూరంగా ఉండటంతో పాటు సత్ప్రవర్తనను అలవరచుకోవాలని మరిపెడ సీఐ పవన్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా బుధవారం మరిపెడ మండలంలోని పలు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. చివరి రోజు నిర్వహించిన ఈ గ్రామసభలు ఎల్లంపేట, అన్నేపురం, లక్ష్మణ్ తండా, సోమల తండా, స్టేజి తండా, బోట్య తండా గ్రామాల్లో ఆయా సర్పంచుల అధ్యక్షతన జరిగాయి. ఎల్లంపేట గ్రామసభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఐ పవన్, ఎస్సై గండ్రతి సతీష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని సీఐ పవన్ పేర్కొన్నారు. యువత మద్యం, మత్తు పదార్థాలు వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సూచించారు. కుటుంబ విలువలు, సామాజిక బాధ్యతలను పాటిస్తూ ఆదర్శ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఎంపీఓ సోమ్లా నాయక్, ఆయా గ్రామాల సర్పంచులు రాధమ్మ, మల్లికంటి వసుమతి-యాకన్న, బానోత్ కర్ణ, బానోత్ అమ్మి-భీమా నాయక్, బానోత్ విజయకౌర్-కిషన్ సింగ్, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.