టీపీసీసీ ఎస్.ఐ.ఆర్ మాస్టర్ ట్రైనర్‌గా బొజ్జ అమరేందర్ రెడ్డి

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; టీపీసీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి మాస్టర్ ట్రైనర్‌గా సీఎం ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి ఎంపికయ్యారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ పర్యవేక్షణలో, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యే టీ. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నియమించిన 36 వేల మంది బిఎల్ఎ -2లకు ఎస్.ఐ.ఆర్. అంశంపై శిక్షణ అందించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ అమరేందర్ రెడ్డి జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో బిఎల్ఎ -2లు, బిఎల్ఓ లు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లకు ఓటరు నమోదు ప్రక్రియ, ఓటరు జాబితా సవరణలు, ఎస్.ఐ.ఆర్. విధివిధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పార్టీ శ్రేణులు, బూత్ స్థాయి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎస్.ఐ.ఆర్. కార్యక్రమం విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.