సెట్విన్ తో మహిళలకు స్వయం ఉపాధి..

సెట్విన్ తో మహిళలకు స్వయం ఉపాధి..

మక్తల్ ను బ్రాండ్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నాది..
సెట్విన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.
.

మక్తల్, ఆంధ్రప్రభ : సెట్విన్ తో వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మక్తల్ పట్టణంలోని సెట్విన్ కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా సెట్విన్ లో టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్ ,కంప్యూటర్ ట్రైనింగ్ విభాగాల్లో శిక్షణ పొందుతున్న మహిళలను నేరుగా కలుసుకొని, వారి శిక్షణ తీరుతెన్నులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సెట్విన్ రాకతో మక్తల్ పట్టణంలోనే మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు మార్గం సుగమయిందని అన్నారు.

టైలరింగ్ తో పాటు అన్ని విభాగాల్లోని మహిళలకు రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకువచ్చి, వారికి నేరుగా ఉపాధిని మక్తల్ లోనే అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అమరచింతలో ప్రత్యేకంగా షెడ్యూల్ నిర్మించి హైదరాబాద్ నుంచి కంపెనీల ద్వారా మహిళలకు ఉపాధి అందిస్తున్నామని తెలిపారు. మక్తల్ లో సైతం పెద్దపెద్ద షెడ్లు నిర్మించి మహిళలకు ఉపాధి అందిస్తామని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ పాఠశాలలో అన్ని విద్యార్థులకు యూనిఫామ్ లను కుట్టే ఉపాధిని సెట్విన్ లో శిక్షణ పొందే వారికి అందించి, వారికి భరోసా కల్పిస్తామన్నారు. మక్తల్ ను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సెట్విన్ లో అన్ని ప్రాంతాల నుంచి ఆర్డర్లు తీసుకొని వచ్చి ఇక్కడి మహిళలు స్వయం ఉపాధి పొందే లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన శిక్షణ పొంది ఆయా విభాగాల్లో నిష్ణాతులుగా తయారు కావాలని సూచించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరికి సెట్విన్ ప్రతినిధులు శాలువా కప్పి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సెట్విన్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ విజయ్ కుమార్, టైలరింగ్ ట్రైనర్ ఫర్జానా, బ్యూటీషియన్ ట్రైనర్ స్వప్న, మగ్గం వర్క్ జర్దోసి ట్రైనర్ వీరమ్మ, కంప్యూటర్ ట్రైనింగ్ ట్రైనర్ తిమ్మప్ప, సిబ్బంది ప్రవీణ్, బికెఆర్ ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, జి.లక్ష్మారెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీవిద్య నీలా గౌడ్, కో ఆప్షన్ మెంబర్ బి.శంషుద్దీన్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గాయత్రి అనిల్ కుమార్, మార్కెట్ డైరెక్టర్ పసుల రంజిత్ రెడ్డి, స్థానిక నాయకులు చెన్నయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply