న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన..
న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన..
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయతలపెట్టారు. సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్ వెనుక భాగంలో ఎండాడ పరిధిలోని ఐదెకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహ నిర్మాణాలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవి ఎన్. తిల్హరి, రవి చీమలపాటి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సన్యాసినాయుడు, ఫస్ట్ ఏడీజే వెంకటరమణ, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, ఇతర న్యాయమూర్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



