ఐటీ చీఫ్ కమిషనర్‌తో ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ భేటీ

ఐటీ చీఫ్ కమిషనర్‌తో ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ భేటీ

ఆంధ్రప్రభ, విజయవాడ: విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి. స్వామి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఆదాయపు పన్ను విభాగ ప్రధాన చీఫ్ కమిషనర్ సురేష్ బట్టినిను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విజయవాడకు తొలి పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హోటల్ రంగానికి సంబంధించిన పన్ను విధానాలు, రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్‌లో సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీతో హాస్పిటాలిటీ రంగం, ఆదాయపు పన్ను శాఖ మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తమైంది.

Leave a Reply