రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ…

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ…

పెడన – ఆంధ్రప్రభ : పెడన మండలం కాకర్లమూడి గ్రామంలో “మీ భూమి- మీ హక్కు” పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ రైతులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసి ఈ పట్టాదారు పుస్తకాల ద్వారా రైతన్నలకు భూములకు సంపూర్ణ రక్షణ లభిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో రెవెన్యూ శాఖలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తూ ప్రజలకు, రైతులకు అత్యంత పారదర్శకమైన , వేగవంతమైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది..

ఆస్తి అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగ బద్ధ హక్కు అన్నారు. గత ప్రభుత్వం హయాంలో వ్యక్తిగత ఫోటోలతో ముద్రించిన పాసు పుస్తకాలు ఇవ్వడం వల్ల అనేక సాంకేతిక, న్యాయ సంబంధిత సమస్యలు తలెత్తాయన్నారు.

ప్రత్యేకంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ముద్రించిన పుస్తకాల విషయంలో సమాజంలో గందరగోళం ఏర్పడిందన్నారు. భూమి రికార్డుల విషయంలో స్పష్టత లోపించిన కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తూ భూ యజమానులకు హక్కులపై సంపూర్ణ భరోసాను కల్పిస్తోందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తగు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, సోలార్ యూనిట్లు, అన్నదాత సుఖీభవ కింద యేడాదికి రూ.20 వేలు, సకాలంలో ఎరువులు పంపిణీ, పంటలకు గిట్టుబాటు ధర కల్పన, పాడి రైతులకు గోకులం షెడ్స్, పలు ప్రోత్సాహకాలు ఇస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

Leave a Reply