తిర్మలయాపల్లిలో గాలివాన బీభత్సం
తిర్మలయాపల్లిలో గాలివాన బీభత్సం
- 11 కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అండ
- మాజీ మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలతో బాధితులకు ఆర్థిక సాయం
- మనోధైర్యం నింపిన ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రాయపర్తి, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సేవా దృక్పథంతో బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. శనివారం మండలం లోని తిర్మలయాపల్లి గ్రామంలో శుక్రవారం సంభవించిన అకాల గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు ఇళ్ల గోడలు కూలిపోయి పేద కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. విషయం తెలుసుకున్న పరుపాటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి గ్రామానికి చేరుకుకొని, గాలివానతో నష్టపోయిన గుడికందుల మణెమ్మ, ఉప్పాల ఎల్లయ్య, భాషబోయిన బుచ్చేల్లయ్య, గడ్డం ఎల్లమ్మ, గజవెల్లి భాగ్యమ్మ, గాజు రమాదేవి, రాచకొండ పురుషోత్తం, వశపాక యకమ్మ, వశపాక లావణ్య, వశపాక కేతమ్మ, గజవెల్లి ప్రమీల కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెబుతూ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. అపదలో ఆదుకున్న ఫౌండేషన్ చైర్మన్కు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, సర్పంచ్ బరిగేలా బాబు, మండల నాయకులు లేతకుల రంగా రెడ్డి, సంకినేని ఎల్లస్వామి, గ్రామ నాయకులు దోకుడు దేవేందర్, గుడి యుగేందర్ రెడ్డి, దోకుడు సొమెందర్, గజావెల్లి రాజు, దోమల కుమార్, వశపాక రాజు, వశపాక బాబు, వశపాక విజయ్ తదితరులు పాల్గొన్నారు.
