వరద కాలువ క్రాస్ రెగ్యులేటర్ గేట్ల మూసివేత

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా సరిహద్దు గ్రామమైన కమ్మర్‌పల్లి మండలం నాగపూర్ వద్ద ఉన్న ఇందిరమ్మ వరద కాలువ క్రాస్ రెగ్యులేటర్‌కు సంబంధించిన పై, క్రింది గేట్లను వరద కాలువ అధికారులు మంగళవారం మూసివేశారు. నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, కాలువ నిర్వహణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

వరద కాలువ డీఈ గణేష్ పర్యవేక్షణలో ఏఈఈలు విన్యాస్, కొండ వంశీ గేట్ల మూసివేత పనులను నిర్వహించారు. అనంతరం కాలువలో నీటి ప్రవాహ పరిస్థితులను పరిశీలించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. నీటి నిర్వహణలో భాగంగానే గేట్లను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.