అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి

నూజివీడు, ఆంధ్రప్రభ: నూజివీడు జంక్షన్ రోడ్డులో జరుగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి.. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని సూచించారు.

విద్యుత్ పనులకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినప్పటికీ, అవసరమైతే రూ.22 లక్షల వరకు తన సొంత నిధులతో విద్యుత్ పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి తెలిపారు. నగర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.