స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే…

స్పీకర్ నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే…
- స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టినట్టే
- రేవంత్ రెడ్డి స్క్రిప్ట్‌ను మాత్రమే స్పీకర్ చదివారు
- కడియంకు నైతికత ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
- స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోతుందని తెలంగాణ తొలి ఉప ముఖ్య మంత్రి డాక్టర్ టి. రాజయ్య తీవ్రంగా విమర్శించారు. స్టేషన్ ఘన్ పూర్‌లోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టినట్లేనని ఆరోపించారు.
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను మాత్రమే స్పీకర్ చదివిన ట్లుగా వ్యవహరించారని విమర్శించారు. పది సంవత్సరాల పాటు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇచ్చిన అవకాశాలతో రాజ్యాంగ పదవులు అనుభవించిన వారు ఇప్పుడు ఆయనను విమ ర్శించడం నైతికతకు విరుద్ధమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమ యంలో పార్టీ మారిన వారిని చట్టబద్ధంగా సీఎల్పీ విలీన ప్రక్రియ ద్వారా చేర్చుకున్నామని, కానీ ఎవరి ఇంటికీ వెళ్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ దీపా దాస్ మున్షీ స్వయంగా కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.
పెద్ద పెండ్యాల సభలో కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పిన కడియం శ్రీహరి మరోసారి కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని చెబుతూ, తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ చెప్పా లని అంటున్నారని విమర్శించారు. కడియం శ్రీహరికి నిజంగా నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ కండువా కప్పుకుని స్టేషన్ ఘన్ పూర్‌లో అడుగు పెట్టాలని రాజయ్య సవాల్ విసిరారు.
చట్టసభ నుంచి తప్పిం చుకున్న కడియం శ్రీహరి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే వెంటనే ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగం, చట్టసభలు, కోర్టులపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వపు రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగవని రాజ య్య అన్నారు.
