నూతన ఎంపీడీవోకు బీజేపీ నాయకుల సన్మానం
మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తాం: ఎంపీడీవో పావని
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల నూతన ఎంపీడీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పావనిని నారాయణపేట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి, తాలూకా నాయకుడు కర్నే స్వామి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో పావని మాట్లాడుతూ, మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు కలిసి సహకరించాలని కోరారు. పారదర్శకంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తారా కృష్ణ, దళిత మోర్చా జిల్లా కార్యదర్శి కొండన్ గోపాల్, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, నాయకులు అశోక్ గౌడ్, సహదేవ్, రవి తదితరులు పాల్గొన్నారు.
