SAIBABA | మంత్రి ఫరూక్ కు ఆహ్వానం
శ్రీ సత్య సాయిబాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు
SAIBABA | నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ : భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు పుట్టపర్తిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులతో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ తోపాటు సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్‌ను, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ను ప్రత్యేకంగా ఈ శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం సత్యసాయి సేవాసమితి కన్వీనర్ డాక్టర్ పి రాజశేఖర్ రెడ్డి సభ్యుడు సుధీర్ బాబు ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం తప్పక హాజరుకావాలని కోరారు.
