TEMPLE | సిద్ధిరామేశ్వరాలయంలో అన్నదానం

TEMPLE |బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయంలో సోమవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం ఆలయ ప్రాంగణంలో అభిషేకాలు నిర్వహించారు .పూజల అనంతరం స్వామివారికి భక్తులు, కోడెల మొక్కు తీర్చుకున్నారు. పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయానికి వచ్చినా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

