వైభవంగా శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలు
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి పుష్కరిణి (కోనేరు) నుండి 108 మంది కన్నెపిల్లలచే కలశ ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. కోనేరులో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి రథోత్సవంలో అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి కలశ ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా శోభాయానమానంగా కొనసాగింది.
చిన్నారులు, మహిళలు, పురుషులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. దారిపొడవునా వాసవి మాత భజన సంకీర్తనలతో, సన్నాయి వాయిద్యాలతో కొనసాగింది.అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి చివరగా అమ్మవారి మూల విరాట్ కు అర్చకుల వేదమంత్రోశ్చరణల మధ్య 108 కలిశాల పుష్కరిణి నీటితో అభిషేకం నిర్వహించారు.అనంతరం అమ్మవారికి విశేష పూజలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ చైర్మన్ కొత్త శ్రీనివాస్ గుప్తా ,ఆలయ అధ్యక్షులు కట్టా సురేష్ కుమార్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం నాయకులు కొత్త జగదీష్ గుప్తా, మనసాని వెంకటేష్, దొంత నరహరి, మనసాని నాగరాజు, బిలకంటి జగదీష్,బిలకంటి నర్సయ్య, ఆళ్లగడ్డ శ్రీనివాస్, వాసవి రాము ,గుగ్గిళ్ళ కృష్ణయ్య , ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకులు కొత్త విజయలక్ష్మి ,కొత్త మీరాబాయి, మనసాని సరళ, వాసవి క్లబ్ అధ్యక్షులు మేడిశెట్టి హరికృష్ణ , వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు కల్వాల ప్రసన్న కిషోర్ ,సభ్యులు కట్ట ఉషారాణి, మనసాని దేవి,బి.పద్మ,అగ్లార్ లక్ష్మి,పాలుట్ల సుష్మ ,చల్లా రూప, గుగ్గిళ్ళ శోభ, పల్లవి, పద్మావతి, శారద ,శ్రీలత ,అగ్లార్ రేఖ ,తదితరులు పాల్గొన్నారు.
