తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి

తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి
తొర్రూరు, ఆంధ్రప్రభ: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు మేరకు మండలంలోని చీకటయపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో గత 20 రోజుల నుండి ఏమాత్రం ధాన్యాన్ని కొనుగోలు చేయటం వల్ల వర్షానికి తడవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
కొనుగోలు కేంద్రాల్లో గడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వసుమతి సీతారాములు, మాజీ జెడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య,బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్ల మాస ప్రమోద్, నాయకులు కాలు నాయక్,గ్రామ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
