పంచముఖ ఆంజనేయుడికి విశేష పూజలు
పంచముఖ ఆంజనేయుడికి విశేష పూజలు
కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని శివనగర్లో కొలువుతీరి ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామికి భక్తులు విశేష పూజలు నిర్వహించారు. శనివారం శనీ త్రయోదశి పురస్కరించుకుని రామాలయంలో కొలువుతీరి ఉన్న నవగ్రహాలకు అర్చకుల ఆధ్వర్యంలో శని త్రయోదశి పూజలు నిర్వహించారు. రామాలయం ప్రాంగణంలో పంచముఖ ఆంజనేయుడుగా విశేష పూజలు అందుకుంటున్న పంచముఖ ఆంజనేయుడికి రామభక్త మండలి, శివనగర్ డివిజన్ ప్రజలు విశేష పూజలు నిర్వహించి స్వామివారి కటాక్ష వీక్షణాలకు పాత్రులైనారు. ఈ కార్యక్రమంలో మంచాల కృష్ణమూర్తి, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
