తాడిచెట్టు పైనుంచి పడిన గౌడ కార్మికుడు…
తాడిచెట్టు పైనుంచి పడిన గౌడ కార్మికుడు…
- తీవ్ర గాయాలు
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్ లో ఓ గౌడన్న ప్రమాద వశాత్తూ జారిపడి తీవ్ర గాయాలు అయిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేసముద్రం విలేజ్ కు చెందిన ఊట్కూరి శ్రీను సోమవారం సాయంత్రం కళ్ళు గీసేందుకు వెళ్లి తాడిచెట్టు ఎక్కగా ప్రమాద వశాత్తూ పైనుంచి క్రింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈసందర్భంగా మంత్రి కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బబ్బురు ఉప్పలయ్య మాట్లాడుతూ గాయాల పాలైన శ్రీనుకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
