దోషరహిత ఓటర్ల జాబితాను రూపొందించడమే ప్రధాన లక్ష్యం..
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ – సార్ ) కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో జరుగుతున్న సార్ ప్రక్రియను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను, డేటా డిజిటలైజేషన్ను ఓటర్ హెల్ప్ డెస్క్లను ఆయన పరిశీలించారు భారత ఎన్నికల సంఘం (ఈ సి ఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకమైన ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు భాగస్వామ్యం కావాలని అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చాలని ఆయన కోరారు.
దోషరహిత ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.ఓటర్ల నమోదు, మార్పులు లేదా చేర్పులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే ఈ సి ఐ హెల్ప్ లైన్ 1950 కు కాల్ చేసి సహాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి శ్రీను తాసిల్దార్ బి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
