cm revanth | వైఎస్సార్‌కు ఘన నివాళి
cm revanth | వైఎస్సార్‌కు ఘన నివాళి
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని వైఎస్సార్‌కు పుష్పాంజలి ఘటించారు.

నాయకులు మాట్లాడుతూ, రైతు సంక్షేమం, పేదల అభ్యున్నతి, ప్రజా సంక్షేమ పాలనలో వైఎస్సార్ అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవా స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు.
