కేక్ కటింగ్ నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్.
ప్రాణదాత స్వర్గీయ వైస్సార్.
సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
ఆరోగ్యశ్రీతో పేదల ఆరోగ్యం భద్రం..
డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి.
పాయకాపురం, ఆంధ్రప్రభ : కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం.రాష్ట్రంలో తగినంత ఆర్ధిక పరిస్థితి లేని పేదల కుటుంబాలు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా వై. ఎస్. రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదలకు ప్రాణదాత అయ్యారని సెంట్రల్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.ఆరోగ్యశ్రీతో పేదల ఆరోగ్యం భద్రం అయ్యిందని వీఎంసీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి పేర్కొన్నారు.దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఘనంగా వైసీపీ శ్రేణులు నిర్వహించారు.
విజయవాడ సెంట్రల్ 58వ డివిజన్ మాజీ వీఎంసీ డిప్యూటీ మేయర్ ఆవుతు శ్రీశైలజ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రభ కాలనీ సింగర్ నగర్ సాయిబాబా గుడి సెంటర్లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్లాది విష్ణు పాల్గొని దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి ఘనమైన నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీతో ప్రాణదాత కాగా,108ద్వారా సహాయకుడిగా,ఫీజు రియంబర్స్ మెంట్ పథకంతో అక్షరాస్యత నిర్మూలన, కిలో బియ్యం రూపాయికే ఇచ్చి ఆహార భద్రత, రుణమాఫీ ఇచ్జి ఆర్ధిక భద్రత కల్పించడం జరిగిందని అన్నారు.
పట్టణంలో ఫ్లైఓవర్లు,పల్లెల్లో నీరు నిల్వ ప్రాజెక్టులు కట్టించిన ఘనత వైస్సార్కు మాత్రమే దక్కుతుందని అన్నారు.ఆయన మరణాంతరం వై. ఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ చేపట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయాలు,వాలేంటీర్ వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రిలు బాగుపడ్డాయని అన్నారు.మరణం లేని మహానేత వైఎస్సార్ అని పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతారని వారన్నారు.
ఈ కార్యక్రమంలో వైసిపిడివిజన్ అధ్యక్షుడు రాజారెడ్డి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మహిళా ప్రెసిడెంట్ తోపుల వరలక్ష్మి , శ్యామ్, డివిజన్ మహిళా ప్రెసిడెంట్ శ్రీలక్ష్మి ,వలి వసంత్, శోభన్, శర్మ, గోపిరెడ్డి, మహేశ్వరీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.స్థానిక62వ డివిజన్ ప్రకాష్ నగర్ ప్రాంతంలో డివిజన్ వైసీపీ అధ్యక్షుడు రామిరెడ్డి ఆధ్వర్యంలో వైస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అలంపూరు విజయ్ లక్ష్మీ, విజయ్ కుమార్,మస్తాన్,బోర బుజ్జి,టి.వెంకట్,బి.సావిత్రి తదితరులు పాల్గొన్నారు.స్థానిక63వ డివిజన్ రాజీవ్ నగర్లో వైసీపీ క్లస్టర్ ఇంచార్జి పసుపులేటి ఏసు ఆధ్వర్యంలో వైస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని శ్రేణులతో కలసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షుడు మన్నెం జగదీష్,రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఎమ్మెల్సీ కార్యాలయంలో వైస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎమ్.డి. రుహుళ్ల పాల్గొని వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎమ్. డి షాహీనా సుల్తానా హఫీజుల్లా,ఎస్. కె అమిత్, రాజు, నెరేళ్ల శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
