మైనార్టీ స్టడీ సర్కిల్లో పోలీస్ ఉధ్యోగాలకు ఉచిత శిక్షణ
మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి యాకూబ్ పాషా
హైదరాబాద్, ఆంధ్రప్రభ: పోలీస్ శాఖ చేపడుతున్న ఉధ్యోగ నియామకాల్లో సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 50 మంది, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు 100 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసి జనరల్ స్టడీస్, అర్థిమెటిక్ ఎబీలీలటీ రీజనింగ్ తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీ కూడా నేర్పిస్తారని అన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు జతచేసి ఈ నెల 15వ తేదీ లోపు తమ తమ జిల్లాల్లోని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాలలో లేదా హైదరాబాద్లోని మైనార్టీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు చెందిన అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని యాకూబ్ పాషా కోరారు. మరిన్ని వివరాల కోసం 8520860785, 040-23236112, 9059050062 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
