లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ల్యాండ్ సర్వే సూపరింటెండెంట్

మహబూబ్‌నగర్, (ఆంధ్రప్రభ): మహబూబ్‌నగర్ జిల్లా సర్వే, భూ రికార్డుల శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. భూత్పూర్‌కు సంబంధించిన ఓ భూ లావాదేవీ ఫైల్‌ను ఉన్నతాధికారులకు సమర్పించేందుకు కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

బుధవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ కార్యాలయంలో రూ.15 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని వెంకటేశ్వర్ రెడ్డిని పట్టుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.