కనకదుర్గమ్మ సేవలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్

కనకదుర్గమ్మ సేవలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్

-కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన జస్టిస్ మందాడి సుబ్రహ్మణ్యం
-ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం
-అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మందాడి సుబ్రహ్మణ్యం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ప్రధానాలయ ఏఈఓ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు.

Leave a Reply