ఘ‌నంగా జాతీయ సాంకేతిక దినోత్సవం

ఘ‌నంగా జాతీయ సాంకేతిక దినోత్సవం

పాయకాపురం, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని ఏపీకాస్ట్ ప్రాంతీయ సైన్స్ సెంటర్, విజయవాడలో జాతీయ సాంకేతిక దినోత్సవం 2026 వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సభ్య కార్యదర్శి డా. కె. శరత్ కుమార్, ఇతర ప్రముఖులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీషా ప్రాంతీయ సైన్స్ సెంటర్‌లోని ప్రదర్శనలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల వినూత్న ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను అభినందించారు. సమాజ అభివృద్ధి, దేశ ప్రగతికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు మైనం హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply