Soft ball | సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ…

Soft ball | సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు క్రీడా సామాగ్రి వితరణ…

Soft ball | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలో గ్రామ సాఫ్ట్ బాల్(Soft ball) క్రీడాకారులకు రూ .10 వేలు విలువ చేసే క్రీడా సామాగ్రిని కమ్మర్ పల్లి వాస్తవ్యుడు తపస్ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు, ఉప్లూర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడైన సల్లూరి కిషన్ గౌడ్ ఈ రోజు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోథ్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తన కొడుకు సల్లూరి శ్రీ సాయి జన్మదినాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లిలో క్రీడలను ప్రోత్సహించడానికి అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిశాంత్, సాగర్, సాఫ్ట్ బాల్ కోచ్ రాహుల్, గ్రామంలో ఉన్న క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply