Bheemgal | ఫ్రీ-ప్రైమరీ తరగతుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Bheemgal | ఫ్రీ-ప్రైమరీ తరగతుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నూతనంగా ప్రారంభమైన ఫ్రీ-ప్రైమరీ తరగతుల కోసం తాత్కాలిక ప్రాతిపదికన ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి డి. స్వామి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా ప్రకటన విడుదల చేశారు.

ముచ్కూర్, మెండోరా, పిప్రి (జె), బాబాపూర్ గ్రామాల ప్రాథమిక పాఠశాలల్లో ఈ నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్‌తో పాటు డీఎడ్ లేదా ప్రీ-ప్రైమరీ టీచింగ్ సర్టిఫికెట్ అర్హతగా ఉండాలని, ఆయా పోస్టుకు ఏడో తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించినట్లు తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాలతో ఈ నెల 10వ తేదీలోపు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నియామకాల్లో స్థానిక గ్రామాలకు చెందిన అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత కల్పించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెల్లడించారు.

Leave a Reply