కోతుల నివారణ పై కౌన్సిలర్ల నిలదీత

కోతుల నివారణ పై కౌన్సిలర్ల నిలదీత

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న కోతుల సమస్య పరిస్కారంలో పాలకవర్గం, అధికారులు పూర్తి స్థాయిలో నివరించలేదని మున్సిపల్ బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిర్లు ఏతం శివకృష్ణ, కొప్పుల ప్రభాకర్ లు ఇవ్వాళ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు.

చెన్నూర్ పట్టణ పరిధి లో కోతుల నివారణ కై మున్సిపల్ సర్వ సభ్య సమావేశంలో 6లక్షలు నిధులు కేటాయిస్తున్నట్లు తీర్మానం చేసినప్పట్టికి పూర్తి స్థాయిలో కోతులను పట్టుకొక పోవడంతో వివిధ వార్డులో పలువురి పై కోతులు దాడులు చేసి గాయపరిచి ఆసుపత్రి పాలు చేస్తున్నాయని ఆరోపించారు. కోతుల నివారణకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేసి ప్రజలను కోతుల దాడులనుంచి రక్షించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply