అందుబాటులో ఉండి సేవలు అందించాలి…
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలు అందించాలని జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తొడసం రాధాబాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్తపెల్లి మహేందర్ అన్నారు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామపంచాయతీ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఉప్పుల సత్యనారాయణకు శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో వారు శాలువతో సన్మానింది, ఇప్పప్పు లడ్డు తినిపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరితో ఓర్పు సహనంతో మెలగాలని ప్రజల సమస్యలు పరిష్కరించాలని పంచాయతీ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలను ఇస్తాను ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని గతంలో కూడా ఈ పంచాయతీలో ఇన్చార్జిగా పనిచేశానని ఈ పంచాయతీలోని ప్రధాన సమస్యలు ప్రజల పరిచయాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాళ్లు మడవి నీలబాయి, రంజన బాయి, తదితరులు పాల్గొన్నారు.
