ఆటోలో పాము కలకలం..!

ఆటోలో పాము కలకలం..!

  • ఉపాధి కూలీలకు తప్పిన ప్రమాదం..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సలో ఉపాధి హామీ కూలీలకు పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉపాధి హామీ పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా, వాహనంలో ఒక్కసారిగా పాము కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో రన్నింగ్‌లో ఉన్న ఆటో నుంచి పలువురు కూలీలు కిందకు దూకడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రేవెల్లి శ్రీనివాస్(51), కోనగిరి తిరుపతి(54), కోనగిరి మల్లన్న(42)కు తీవ్ర గాయాల‌య్యాయి. గాయపడిన వారిని వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో పాము ఘటన స్థానికంగా కలకలం రేపింది.