బైకు అదుపుతప్పి డీసీపీ గన్ మెన్‌కు తీవ్ర గాయాలు

బైకు అదుపుతప్పి డీసీపీ గన్ మెన్‌కు తీవ్ర గాయాలు
జన్నారం, ఆంధ్రప్రభ:
డీసీపీ గన్ మెన్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కోడిజుట్టు శ్రీనివాస్ ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల డీసీపీ భాస్కర్ గన్ మెన్, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, లక్షేటిపేట మండలంలోని వెంకట్రావుపేట వాసి కోడిజుట్టు శ్రీనివాస్ పొనకల్‌లోని తమ బంధువుల ఇంట్లో జరిగిన సమ్మక్క ఫంక్షన్‌కు వచ్చారు. తిరిగి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై మంచిర్యాలకు వెళుతుండగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంకు సమీపాన ఆ ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
తీవ్రగాయాలకు గురైన శ్రీనివాస్‌ను మంచిర్యాలలోని మేడి లైఫ్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, డీసీపీ గన్ మెన్ శ్రీనివాస్ ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోగా, అతని తలకు, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ సాయంత్రం తెలిపారు.
