గూడెం క్షేత్రంలో ఆంజనేయ స్వాముల గిరి ప్రదక్షిణ.
గూడెం క్షేత్రంలో ఆంజనేయ స్వాముల గిరి ప్రదక్షిణ.
దండపల్లి, ఆంధ్రప్రభ : దండపల్లి మండలంలోని గూడెం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి క్షేత్రంలో బుధవారం ఆంజనేయ స్వాములు భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణలు ఘనంగా నిర్వహించారు. గోదావరి తీరంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ వ్యవస్థాపక అర్చకులు పెరంబుదూరి హరీష్ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు జరిపించారు.భక్తులు ముందుగా గోదావరి నది తీరంలో కొలువైన ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పాద యాత్రగా బయలుదేరారు. స్వామివారి నామస్మరణతో గూడెం గుట్ట పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బత్తుల చందు, చుంచు సత్తన్న, కర్నాల శ్రీకాంత్, గొల్ల మల్లేష్, కనగంటి కుమార్, కర్నాల అంజన్న, అక్కల సతీష్, వేముల అశోక్, అల్లాం లింగన్న, బత్తుల అజయ్, బత్తుల రక్షిత్, చుంచు సంతోష్, అల్లం మనీష్ తదితరులు పాల్గొన్నారు.
