​ సీఐగా సిరికొండ సురేష్ బాధ్యతల స్వీకరణ

చిట్యాల, ఆంధ్రప్రభ: నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) గా సిరికొండ సురేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు నల్గొండ స్పెషల్ బ్రాంచ్ 2 సీఐగా విధులు నిర్వహించిన ఆయన, ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా నార్కట్ పల్లి సర్కిల్ బాధ్యతలను చేపట్టారు. ఇక్కడ సీఐగా పనిచేసిన కైగురి నాగరాజు హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి బదిలీ కావడంతో, ఆయన స్థానంలో సురేష్ నియమితులయ్యారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన సీఐ సిరికొండ సురేష్ మాట్లాడుతూ పరిధిలోని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణతో పాటు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ​ఈ సందర్భంగా నూతన సీఐకి పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు మరియు విలేకరులు శుభాకాంక్షలు తెలియజేశారు.