వాళ్లకు ఓటు వేస్తే.. అంధకారమే..

వాళ్లకు ఓటు వేస్తే.. అంధకారమే..

బిక్కనూర్, ఆంధ్రప్రభ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇటిక్యాల సురేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున రహమత్ నగర్ డివిజన్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ.. తాము నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను ఓటర్లకు వివరించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అన్నారు. ప్రతిపక్షాలకు ఓట్లు వేస్తే నియోజకవర్గం అంధకారంలో ఉంటుందని వివరించడం జరిగిందన్నారు.

Leave a Reply