బదిలీ అయిన అధికారులకు ఘన వీడ్కోలు

బదిలీ అయిన అధికారులకు ఘన వీడ్కోలు

మందమర్రి, ఆంధ్రప్రభ: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న ఉన్నతాధికారులకు ఘనంగా వీడ్కోలు సన్మానం నిర్వహించారు.

కళ్యాణిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా సేవలందించి, రామగుండం ఏరియాకు జీఎం సేఫ్టీగా పదోన్నతిపై బదిలీ అయిన మల్లయ్య, మందమర్రి ఏరియా సీనియర్ పర్సనల్ ఆఫీసర్‌గా పనిచేసి భూపాలపల్లి ఏరియాకు బదిలీ అయిన వంశీలను ఈ సందర్భంగా శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.

ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో బదిలీ అయిన అధికారుల సేవలు ఎనలేనివని కొనియాడారు. నూతన బాధ్యతల్లోనూ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జీఎం సెక్షన్ ఆఫీసర్ జి.ఎల్. ప్రసాద్, నూతన కేకేఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాంబాబు, కేకే గ్రూప్ ఏజెంట్ ఖదీర్, అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, అధికారులు, సిబ్బంది పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.