మృతుల కుటుంబాలను పరామర్శించిన వెన్నంపల్లి పాపయ్య
కనిపర్తి, నాగుర్లపల్లి గ్రామాల్లో బాధిత కుటుంబాలకు బీజేపీ నేత పరామర్శ
రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ మండలం కనిపర్తి, నాగుర్లపల్లి గ్రామాలకు చెందిన సాదు కొంరమ్మ, ముత్యాల ఒదమ్మ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెన్నంపల్లి పాపయ్య ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రేగొండ మండల అధ్యక్షుడు బండి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుర్రం రమేష్, జిల్లా నాయకుడు జాలిగపు రాజయ్య, మండల నాయకులు వెంకన్న, బాసికల సంపత్, సాదు దేవేందర్, బూత్ అధ్యక్షుడు గువ్వ సురేష్, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.
