అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ శ్రీ లక్ష్మీనరసింహ గణపతి దత్త సాయిబాబా ఆలయంలో 22వ ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు కోరిపెల్లి కపిల, దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా వేద పండితులు రాజశేఖర్ శర్మ, నిమ్మగడ్డ సుధాకర్ శర్మ, గుడి చంద్రశేఖర శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య పలు జంటలతో యజ్ఞ, యాగాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిపించారు.

కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామి, పి.ఎన్. మూర్తి, కోరిపెల్లి నర్సారెడ్డి, భూషణ్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి, ఆమెడ శ్రీధర్, బద్రి శ్రీనివాస్, ముత్యం రెడ్డి, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply