Sing Geetham | మూవీపై మరింత పెరిగిన క్రేజ్

Sing Geetham | మూవీపై మరింత పెరిగిన క్రేజ్

Sing Geetham | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ‘సింగ్ గీతం’ సినిమాపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా, మూవీ టీమ్‌కు దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం మొదటి టికెట్‌ను స్వయంగా కొనుగోలు చేసి తన మద్దతును తెలియజేశారు.

దీంతో సోషల్ మీడియాలో #SSRforSSR హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. ‘సింగ్ గీతం’ టీమ్‌కు ఇది మంచి ఉత్సాహాన్ని ఇచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాజమౌళి వంటి స్టార్ దర్శకుడు ఇలా ముందుకు రావడం సినిమాపై మరింత క్రేజ్ తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు, ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన నేపథ్యంలో అభిమానులు ముందుగానే తమ టికెట్లు బుక్ చేసుకోవాలని మూవీ టీమ్ సూచిస్తోంది. ‘సింగ్ గీతం’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.