చిరుతకే చుక్కలు..

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోకి చొరబడ్డ చిరుతను ఒక వీధి కుక్క ధైర్యంగా ఎదుర్కొంది. కేవలం ఎదుర్కోవడమే కాకుండా, దానిని దాదాపు 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.
ఎలా జరిగిందంటే…
నాసిక్ జిల్లా నిఫాద్ ప్రాంతంలో రాత్రివేళ చిరుత గ్రామంలోకి ప్రవేశించింది. ఊహించని విధంగా ఒక వీధి కుక్క దానిపై దాడి చేసింది. కుక్క ఒక్కసారిగా చిరుత గొంతును గట్టిగా పట్టు పట్టి తన అదుపులోకి తెచ్చుకుంది. ఆపై భయపడకుండా లాగుతూ దాదాపు 300 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లింది. చివరికి ఆ చిరుత తనను తాను విడిపించుకుని పక్కని పొలాల వైపు పారిపోయింది.
ఈ ఘటనలో గ్రామస్తులు ఎవరూ గాయపడలేదు. కుక్క కూడా సురక్షితంగానే బయటపడింది. చిరుత గాయపడ్డదా? దానికి వైద్య సహాయం అందిందా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అటవీ శాఖ మాత్రం గ్రామ ప్రజలు, పశువులు సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది.
వీడియో వైరల్ !!
ఒక వీధి కుక్క ఇలా చిరుతపులి దాడిని ఎదుర్కోవడం చాలా అరుదు. అదీ.. దానిని అంత దూరం ఈడ్చుకెళ్లడం ఊహించని విషయం. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
