Jukkal | ప్రజాసంక్షేమమే ధ్యంయంగా..

Jukkal | ప్రజాసంక్షేమమే ధ్యంయంగా..

  • ఆంధ్రప్రభ క్యాలెండర్ ను ఆవిష్కరించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట

Jukkal | జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : పార్టీలకుఅతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రభ ముందుకు సాగుతుందని కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆంధ్రప్రభ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఆంధ్రప్రభ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజాసమస్యలను, వారి సాధక బోధకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఘనత ఆంధ్రప్రభకే దక్కిందన్నారు. దీంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా తమ వార్తల ద్వారా వెలుగులోకి తీసుకొస్తూ తమ వంతు సహకారాన్ని ఆంధ్రప్రభ అందిస్తుందన్నారు. దశాబ్దాల చరిత్ర గల ఆంధ్రప్రభ కాలానుగుణంగా మార్పులు తీసుకొస్తూ డిజిటల్ వైపు పరుగులు పెడుతూ, స్మార్ట్ ఎడిషన్, యూట్యూబ్ ఛానల్, వెబ్ న్యూస్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు అన్నారు. ఆంధ్రప్రభ యాజమాన్యానికి, పత్రికా సోదరులందరికీ ఆయన అభినందనలను తెలియజేశారు.

Leave a Reply