మండల కాంగ్రెస్ పార్టీలో సహకార జోష్

మండల కాంగ్రెస్ పార్టీలో సహకార జోష్

  • సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండళ్ళు…
  • 8 మంది అధ్యక్షులు, 8 ఉపాధ్యక్షులు, 104 మంది డైరెక్టర్లు…
  • కొత్త పదవుల కోసం ఆశావాహులు చూపు

వేంసూరు, ఆంధ్రప్రభ ; ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలక మండళ్ళు నియమించాలని, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయంతో మండల కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. అధ్యక్ష స్థానాలకై ఆశావాకులు తమ ప్రయత్నాలను ప్రారంభించినట్లు ప్రచారం. ఎన్నికలు అనగానే రాజకీయ పార్టీల ప్రమేయం ఉంటుంది. సహకార సంఘాలు నామినేటెడ్ కావటంతో అధినాయకుల అండదండలు, ప్రజా ప్రతినిధుల మద్దతు కొరకు ప్రయత్నాలు ప్రారంభం అయినట్లు సమాచారం. మండలంలో 8 సహకార సంఘాలు ఉన్నాయి.

వేంసూరు, లచ్చన్నగూడెం, కందుకూరు, భరణిపాడు, అమ్మపాలెం, కేజీ మల్లేల, అడసర్లపాడు, పల్లెవాడ సహకార సంఘాల పరిధిలో గ్రామ ప్రథమ, ద్వితీయ శ్రేణి నాయకులు పోటీపడే అవకాశం సుస్పష్టం. సహకార సంఘాల పాలక మండళ్ళ పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి తో ముగిసింది. అనంతరం ప్రత్యేక అధికారులు నియామకం జరిగింది. గత కొంత కాలం నుంచి సహకారంలో నామినేటెడ్ జరుగుతాయని ప్రచార నేపథ్యంలో, అప్పటి నుంచే కొందరు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించగా, రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయంతో కొత్త పదవుల కోసం, ఖర్చు లేని విధానం కావడంతో గ్రామ స్థాయిలో నాయకులు ఆశిస్తున్నారు.

సహకార సంఘం నామినేటెడ్ వల్ల మండలంలో 8 మంది అధ్యక్షులు, 8 మంది ఉపాధ్యక్షులు, 104 మంది డైరెక్టర్లు ఎంపిక అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల నుంచి వినికిడి. గ్రామ పంచాయితీ ఎన్నికలలో ఓటమి పాలైన వారు కూడా ఆశించే వారిలో ఉన్నట్లు ప్రచారం. వేంసూరు సహకార సంఘం అధ్యక్ష స్థానం కొరకు లింగపాలెం నుంచి ఇద్దరు, భీమవరం నుంచి ఒకరు, వేంసూరు నుంచి ఒకరు ప్రస్తుతం ఆశిస్తున్నట్లు వినికిడి. పల్లెవాడ సహకార సంఘం అధ్యక్ష స్థానం కొరకు పల్లెవాడ నుంచి ఒకరు, రాజుగూడెం నుంచి ఒకరు, చౌడవరం తండా నుంచి ఒకరు, చౌడవరం నుంచి ఒకరు ఆశిస్తున్నట్లు ప్రచారం.

లచ్చన్నగూడెం సహకార సంఘం అధ్యక్ష స్థానం కొరకు లచ్చన్నగూడెం నుంచి ఇద్దరు, మర్లపాడు నుంచి ఇద్దరు ఆశిస్తున్న వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. కందుకూరు సహకార సంఘం అధ్యక్ష స్థానం కొరకు కందుకూరు నుంచి ఇద్దరు, వెంకటాపురం నుంచి ఇద్దరు ఉన్నట్లు తెలుస్తుంది. భరణిపాడు సహకార సంఘం అధ్యక్ష స్థానం కొరకు భరణిపాడు నుంచి ఇద్దరు, దుద్దెపూడి నుంచి ముగ్గురు ఆశిస్తున్నట్లు ప్రచారం. అమ్మపాలెం సహకార సంఘం అధ్యక్ష స్థానం కొరకు అమ్మపాలెం ఒకరు, రాయుడుపాలెం ఒకరు, కల్లూరుగూడెం నుంచి ఒకరు ఆశిస్తున్నట్లు వినికిడి. కేజీ మల్లేల సహకార సంఘం అధ్యక్ష స్థానానికి జననేత, ప్రజా ప్రతినిధి ఆశిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.

కేజీ మల్లెల నుంచి ఒకరు, కుంచపర్తి నుంచి ఇద్దరు అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం. ఇటీవలనే నూతనంగా ఏర్పడిన అడసర్లపాడు సహకార సంఘం తొలి అధ్యక్ష పదవికి అడసర్లపాడు నుంచి ముగ్గురు, రామన్నపాలెం నుంచి ఒకరు ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారంలో ఉంది. అధ్యక్ష స్థానం చేపట్టిన వారి నుంచే ఇద్దరు లేక ముగ్గురు జిల్లా డైరెక్టర్లుగా ఎంపిక అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల బోగట్టా. సహకార సంఘాల నామినేటెడ్ కావాలంటే సహకార చట్టంలో చేర్పులు, మార్పులు అనంతరం ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల ప్రచారం.

Leave a Reply