SC Representatives Meeting | సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు

కులగణన, మాదిగ ఉపకులాల ఏబీసీడీ వర్గీకరణపై చర్చ
సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వ చర్యలకు మద్దతు తెలిపిన ప్రతినిధులు
సామాజిక న్యాయ చర్యలకు కృతజ్ఞతలు
దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఎస్సీ ప్రజాప్రతినిధుల సమావేశం

SC Representatives Meeting | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు చర్చించారు. హైదరాబాద్‌లోని దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో నాగర్‌కర్నూల్ ఎంపీ, తెలంగాణ ఎంపీల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కులగణన ప్రక్రియ, మాదిగ ఉపకులాల ఏబీసీడీ వర్గీకరణ, ఎస్సీ వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజాప్రతినిధులు చర్చించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం అందించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వారు స్వాగతించారు. ముఖ్యంగా కులగణన, మాదిగ ఉపకులాల వర్గీకరణ వంటి అంశాలపై ప్రభుత్వం చూపుతున్న చొరవకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.