రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదు..

  • విజయవాడలో మొబైల్ కోర్టు నిర్వహణ
  • 22 మందికి రూ.5,780 జరిమానా విధింపు

చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ వంటి కార్యక్రమాలతో చెత్త రహితం గా ఉంచడానికి ఉన్నతాధికారులు కృషి చేస్తున్నప్పటికీ కొంతమంది బాధ్యతారాహిత్యంగా వీధుల్లో చెత్త వేయడం చేస్తున్నారు. విజయవాడ నగరంలో రోడ్ల మీద చెత్తాచెదారం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం నేరం. దాంతో సర్కిల్ వన్ కార్యాలయం పరిధిలో రోడ్లు పై చెత్త చేస్తున్న వారి పై శానిటరీ ఇన్స్పెక్టర్ లు సమరీ ట్రైయల్ కేసులు నమోదు చేస్తున్నారు.

అంతేకాకుండా విజయవాడ నగరంలో లైసెన్స్ లేకుండా వ్యాపార చేయడం కూడా నేరమే. దాంతో విజయవాడ నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్ లు వారి పై ఎస్ .టి. సి లు నమోదు చేస్తుంటారు. అలాంటి కేసులు పరిష్కరించడానికి విజయవాడ నగర పరిధిలో ఉన్న సర్కిల్ కార్యాలయంలో నెలకొకసారి మొబైల్ కోర్టు నిర్వహిస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ వన్ కార్యాలయం లో శుక్రవారం ఉదయం 8 వ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తల్లాప్రగడ అంజని రామ ఆదిత్య రిషిక్ మొబైల్ కోర్టు ను నిర్వహించారు. సర్కిల్ వన్ కార్యాలయం పరిధిలో ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ లు 22 మంది పై సమరీ ట్రైయిల్ కేసులు నమోదు చేశారు. వాటిలో రోడ్ల పై చెత్తాచెదారం వేయడం లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయడం లాంటివి ఉన్నాయి.

ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారి ని మొబైల్ కోర్టు లో ప్రవేశ పెట్టేరు. మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ వన్ కార్యాలయం పరిధిలో రోడ్ల పై చెత్తాచెదారం వేసిన వారికి , లైసెన్స్ లేకుండా వ్యాపారాలు వారికి మొత్తం 22 మందికి జరిమానా విధించారు. ఈరోజు మొబైల్ కోర్టు లో 22 మంది నుండి 5780 రూపాయలు అపరాధ రుసుం వసూలు చేశారు. ఈ కార్యక్రమం లో ఏ.ఎం.హెచ్ ఓ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్ లు డి.సోమరాజు, ఎస్.వి.ఎస్ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు జి. దుర్గారావు, శామ్యూల్, ఆనంద్ కృపాల్, వి. శ్రీనివాసరావు, ఆదినారాయణ కె. కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.