డబ్ల్యూపీఎల్ లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తుగా ఓడించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 17 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.
ముంబై బ్యాటర్లలో హీలీ మాథ్యూస్ (59) కూడా హాఫ్ సెంచరీతో రాణించగా.. మరోవైపు ఆల్‌రౌండర్ నాట్ స్కీవర్ బ్రంట్ (75 నాఔట్; 44 బంతుల్లో 13 ఫోర్లు) పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ కీలకమైన 3 వికెట్లు పడగొట్టి విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది.